News July 12, 2024
3వ తరగతి బాలికపై హత్యాచారం.. CM చంద్రబాబు సీరియస్
AP: నంద్యాల జిల్లాలో 3వ తరగతి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు హత్యాచారానికి పాల్పడటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటన కలచివేసిందని, ప్రభుత్వం నేరాలను అంగీకరించదని స్పష్టం చేశారు. ‘ఆడబిడ్డల సంరక్షణకు సంస్థాగతంగా మెకానిజం కావాలి. పిల్లలు తప్పులు చేయకుండా తల్లిదండ్రులు నిశితంగా పర్యవేక్షించాలి. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో మానవతా విలువలపై సిలబస్ చేర్చుతున్నాం’ అని సీఎం ట్వీట్ చేశారు.
Similar News
News January 19, 2025
VIRAL: కుంభమేళాలో ఈయన స్పెషల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాకు వచ్చిన వారిలో రోజుకో బాబా సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. తాజాగా ఏడు అడుగులున్న రష్యాకు చెందిన ‘ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ బాబా’ గురించి చర్చించుకుంటున్నారు. ఈ కండలు తిరిగిన సాధువు తన జీవితాన్ని హిందూమత ప్రచారానికి అంకితం చేశారు. ఆయన 30 ఏళ్ల క్రితం టీచర్ ఉద్యోగాన్ని వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించారు.
News January 19, 2025
ట్రంప్‌తో ముకేశ్- నీతా అంబానీ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, దీనికి ముందే ట్రంప్ ఏర్పాటు చేసిన ‘క్యాండిల్ లైట్ డిన్నర్’కు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో వీరు దిగిన ఫొటో వైరలవుతోంది. కాగా, ప్రమాణస్వీకారోత్సవం తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ ఇచ్చే డిన్నర్లోనూ వీరు పాల్గొననున్నారు.
News January 19, 2025
‘పరీక్షా పే చర్చ’కు భారీగా అప్లికేషన్లు
ప్రధాని మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి 3.5 కోట్లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సందర్భంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ చర్చిస్తారు. కాగా పరీక్షా పే చర్చా ఎడిషన్-8 నిర్వహణ తేదీ ఇంకా ప్రకటించలేదు.