News August 26, 2024

వైద్యురాలిపై హత్యాచారం.. మరిన్ని సంచలన విషయాలు!

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో నిందితుడు సంజ‌య్ రాయ్ CBIకి మరిన్ని సంచలన విషయాలు వెల్లడించినట్లు INDIA TODAY తెలిపింది. నేరం చేయ‌డానికి ముందు అతడు స్నేహితుడితో కలిసి 2 రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లివ‌చ్చాడని, అయితే అక్క‌డ సంభోగం చేయ‌లేద‌ని CBIకి చెప్పినట్టు పేర్కొంది. సంజయ్ దారిలో ఓ అమ్మాయిని వేధించాడని, తన గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్లు వివరించింది.

Similar News

News April 2, 2026

ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

image

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>

News April 2, 2026

సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లోని మూవీపై ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.

News April 2, 2026

రూపీ సూపర్ రికవరీ

image

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.