News August 26, 2024
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నిందితుడి పొంతన లేని సమాధానాలు?

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘నేను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయింది. సెమినార్ హాల్లో డెడ్ బాడీ కనిపించింది. భయపడి పారిపోయా’ అంటూ అతడు చెప్పినట్లు సమాచారం. ఘటన జరిగినప్పుడు తాను మరో చోట ఉన్నట్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అటు నిందితుడు ఏం చెప్పారన్న విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
Similar News
News November 19, 2025
పాడేరు: ‘1,44,222 మంది రైతులకు పెట్టుబడి సాయం’

రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బుధవారం పాడేరు కాఫీ హౌస్‌లో వ్యవసాయ శాఖ నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 22మండలాల్లో 1,44,222 మంది గిరిజన రైతులకు ఒక్కొక్కరికి రూ.7వేలు చొప్పున పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
News November 19, 2025
అల్పపీడనం.. రెండు రోజులు వర్షాలు!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News November 19, 2025
వన్డేల్లో తొలి ప్లేయర్‌గా రికార్డు

వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఫుల్ మెంబర్ టీమ్స్ అన్నింటిపై సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. అటు వన్డేల్లో హోప్ 19 సెంచరీలు నమోదు చేశారు. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ ఫుల్ మెంబర్స్ టీమ్స్. కాగా ఇవాళ్టి రెండో వన్డేలో వెస్టిండీస్‌పై NZ గెలిచింది.


