News August 28, 2024

వైద్యురాలిపై హత్యాచారం భయానకం: రాష్ట్రపతి

image

RGకర్ వైద్యురాలిపై హత్యాచారం కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అది భయానకమని, ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న దారుణాల్లో ఒకటని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో మన కూతుళ్లు, సోదరీమణులపై అఘాయిత్యాలకు తావులేదన్నారు. అందుకే దేశం భగ్గుమంటోందని, తానూ అందులో ఒకర్నని అన్నారు. ‘కోల్‌కతాలో స్టూడెంట్స్, వైద్యులు, పౌరులు ఆందోళన చేస్తున్నా నేరగాళ్లు ఎక్కడో స్వేచ్ఛగా తిరుగుతున్నారు’ అని చెప్పారు.

Similar News

News November 26, 2025

శ్రీకాకుళం రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్

image

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 27న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. శ్రీకూర్మాం చేరుకొని శ్రీకూర్మనాధ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. రాత్రి శ్రీకాకుళం ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస చేసి 28న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారని వివరించారు.

News November 26, 2025

నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు

image

1921: వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జననం
1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది
1997: సినీ నటుడు మందాడి ప్రభాకర రెడ్డి మరణం
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబై ఉగ్ర దాడిలో 160 మందికిపైగా మృతి (ఫొటోలో)
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం

News November 26, 2025

అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

image

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్‌, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.