News February 9, 2025
వెల్‌జన్ అధినేత హత్య.. పారిశ్రామిక వర్గాల దిగ్భ్రాంతి

ఏలూరుకు చెందిన VELJAN గ్రూపుల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును ఆయన మనవడు HYDలో హత్య చేసిన ఘటన పారిశ్రామిక వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పెద్ద కూతురి కుమారుడికి సంస్థ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారన్న ఆగ్రహంతో చిన్న కుమార్తె కొడుకు కీర్తితేజ డ్రగ్స్ మత్తులో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు సమాచారం. కాగా జనార్దనరావు చేసిన మంచిపనుల్ని, వితరణల్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News February 10, 2026
హైదరాబాద్‌లో విజయ్-రష్మిక రిసెప్షన్?

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మరింత బలం చేకూరుస్తూ మార్చి 4న వీరి రిసెప్షన్ HYDలోనే జరగనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరవుతారని పేర్కొన్నాయి. పెళ్లి రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. అయితే పెళ్లిపై రష్మిక-విజయ్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Photo: AI
News February 10, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News February 10, 2026
భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

టీ20 వరల్డ్ కప్‌లో ఈ నెల 15న టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీసీ, బీసీబీ, పీసీబీ, శ్రీలంకతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ నెల 15న యథావిధిగా మ్యాచ్ జరగనుందని ఐసీసీ పేర్కొంది. భారత్‌తో మ్యాచ్ ఆడాలని <<19097083>>బీసీబీ<<>> రిక్వెస్ట్ చేసిన కాసేపటికే పాక్ ప్రభుత్వం ఈ ట్వీట్ చేయడం గమనార్హం.


