News March 18, 2024
నాలుగు నెలల మనవడికి మూర్తి రూ.240కోట్లు గిఫ్ట్!

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం మూర్తి షేర్లు 0.40% నుంచి 0.36శాతానికి తగ్గాయి. కాగా గత ఏడాది నవంబరులో నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి-అపర్న కృష్ణన్ దంపతులు ఏకగ్రహకు జన్మనిచ్చారు.
Similar News
News April 18, 2025
ALERT: నేడు పిడుగులతో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని 83 మండలాల్లో వడగాలులు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.
News April 18, 2025
చైనా నన్ను కలవాలనుకుంటోంది: ట్రంప్

చైనా దిగుమతులపై US 245% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య వివాదం ముదిరింది. US ఇలాగే టారిఫ్‌ల ఆట కొనసాగిస్తే దాన్ని పట్టించుకోబోమని చైనా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో చైనా తనను కలవాలని అనుకుంటోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల మెక్సికో, జపాన్ వాణిజ్య ప్రతినిధులతో ప్రయోజనకర సంభాషణ జరిగిందని, ఇలాగే ఆ దేశమూ చర్చలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, చైనా దీనిపై స్పందించాల్సి ఉంది.
News April 18, 2025
రూ.10 నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందంటే?

రెండు రంగులతో కనిపించే రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఆర్బీఐ రూ.5.54 ఖర్చు చేస్తుంది. కాయిన్ మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో, బయటి సర్కిల్‌ను అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. అలాగే, నాణెం బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములతో మొత్తం 7.71గ్రా. బరువు ఉంటుంది. గతంలో కొన్ని రోజులు ఈ నాణేలు చెల్లవని ప్రచారం జరిగినా, అవి చట్టబద్ధమైనవని ఆర్బీఐ అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.