News July 8, 2025
వరుసగా మూడు సెంచరీలు చేసిన ముషీర్

టీమ్ ఇండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నారు. లౌబరో UCCEతో జరిగిన మ్యాచులో ముంబై ఎమర్జింగ్ టీమ్ తరఫున ఆడుతున్న ముషీర్ వరుసగా మూడో సెంచరీ చేశారు. 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశారు. అంతకుముందు నాటింగ్‌హమ్ షైర్‌తో జరిగిన మ్యాచులో సెంచరీతో పాటు ఆరు వికెట్లు తీయగా, కంబైన్డ్ నేషనల్ కౌంటీస్‌పైనా సెంచరీ చేశారు.
Similar News
News July 8, 2025
దేశంలో తెలుగు మాట్లాడేవారు ఎంత మందో తెలుసా?

భారతదేశంలో సుమారు 22 రాజ్యాంగబద్ధ భాషలతో పాటు వేలాది భాషలు వాడుకలో ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది హిందీ భాషనే మాట్లాడుతుంటారు. దేశంలో హిందీని 54కోట్ల మంది మాట్లాడతారని తెలుస్తోంది. ఆ తర్వాత బెంగాలీని 10కోట్ల మంది, మరాఠీని 8.5 కోట్ల మంది, తెలుగును 8.3 కోట్ల మంది మాట్లాడతారని అంచనా వేస్తున్నారు. తమిళం(7.8 కోట్లు), గుజరాతీ(6 కోట్లు), 5.5 కోట్ల మంది ఉర్దూను మాట్లాడుతున్నారు.
News July 8, 2025
అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక సమర్పణ

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఈ రిపోర్టును రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదిక 4-5 పేజీలతో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి 270 మంది మరణించిన విషయం తెలిసిందే.
News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.