News October 29, 2024
నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ప్రారంభం: CM

TG: మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు నవంబర్ 1న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ‘నవంబర్‌లోపు టెండర్లు పిలుస్తాం. మూసీపై ముందడుగే తప్ప వెనకడుగు వేయం. మొదటి విడతలో బాపూఘాట్ నుంచి 30 కి.మీ మేర పనులు చేపడతాం. ఇప్పటికే రూ.140 కోట్లతో DPR తయారీకి ఆదేశాలిచ్చాం. నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కల్పిస్తాం. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News February 10, 2026
నియోనాటల్ పీరియడ్

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు కీలక సమయం. దీన్ని నియోనాటల్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో సంరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్ పీరియడ్‌లో బిడ్డకు అనారోగ్యాల ప్రమాదం తగ్గించడం, పెరుగుదలను ప్రోత్సహించడం కోసం స్పెషల్ కేర్ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాస సరిగా తీసుకునేలా చేయడం, తల్లి పాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.
News February 10, 2026
పంట నుంచి పత్తి తీసేటప్పుడు ఈ తప్పులు వద్దు

కొన్నిసార్లు కొన్ని పత్తి కాయలు పగిలి, మరికొన్ని పగలకుండా ఉంటాయి. అప్పుడు వాటిని కోసేందుకు రైతులు 2,3 రోజులు ఆగుతారు. అయితే అకాల వర్షాలు, మంచు వల్ల అప్పటికే పగిలిన పత్తి కూడా రంగు మారి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. అందుకే పగిలిన కాయల నుంచి పత్తిని వెంటనే తీసేయాలి. పూర్తిగా పగలని కాయల నుంచి పత్తిని తీస్తే అది ముడిపత్తిలాగా ఉండి, నాణ్యమైన పత్తితో కలిపి మార్కెట్ చేసినపుడు ధర కోల్పోయే ప్రమాదం ఉంది.
News February 10, 2026
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 64 పోస్టులు.. అప్లై చేశారా?

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(CSL)64 ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టుల భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ICAI, MBA(HR), పీజీ(సోషల్ వర్క్) అర్హత గలవారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cochinshipyard.in


