News February 2, 2025
నాని ‘ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న ‘ది ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ ఖరారయ్యారు. మూవీ టీమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ‘ఇప్పుడు అధికారికంగా అనిరుధ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం’ అని ట్వీట్ చేసింది. నాని, అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు రాగా ‘ప్యారడైజ్’ మూడోది కానుంది. అటు నానికి శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత ఇది రెండో సినిమా.
Similar News
News February 2, 2025
ప్రపంచ జనాభా.. బ్లడ్ గ్రూపుల వారీగా
O+: 42 శాతం
A+: 31 శాతం
B+: 15 శాతం
AB+: 5 శాతం
O-: 3 శాతం
A-: 2.5 శాతం
B-: 1 శాతం
AB-: 0.5 శాతం
**మరి మీది ఏ గ్రూప్..? కామెంట్ చేయండి.
News February 2, 2025
SO SAD.. దక్షిణాఫ్రికాకు మరోసారి హార్ట్ బ్రేక్
అంతర్జాతీయ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికాకు అస్సలు కలిసి రావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో విజయం వారికి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలింది. తాజాగా U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఆ జట్టు ప్లేయర్లు కన్నీరుపెట్టుకున్నారు. ఏడాది వ్యవధిలోనే సీనియర్స్ మహిళల, పురుషుల T20 WC ఫైనల్స్‌లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి WTC ఫైనల్లోనైనా గెలుస్తుందేమో చూడాలి.
News February 2, 2025
ఆ హీరోను అన్నయ్య అని పిలుస్తా: కీర్తి సురేశ్
మలయాళ హీరో దిలీప్‌తో చిన్నతనంలో కూతురు పాత్రలో నటించినట్లు హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపారు. ఆ తర్వాత ఆయనను అంకుల్ అని పిలిచినట్లు చెప్పారు. కొన్నేళ్లకు ఆయనకు గర్ల్ ఫ్రెండ్ రోల్లో నటించగా ఆ సమయంలో అంకుల్ అని కాకుండా అన్నయ్య అని పిలవాలని దిలీప్ చెప్పినట్లు వెల్లడించారు. ఇక అప్పటినుంచి ఆయనను చేటా(అన్నయ్య) అని పిలుస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.