News November 8, 2024

మ్యూజిక్ డైరెక్టర్ స్థలం కబ్జా: ప్రభుత్వం స్వాధీనం

image

TG: సంగీత దర్శకుడు చక్రవర్తికి ఎన్టీఆర్ హయాంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నం.14లో 20 గుంటల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో చక్రవర్తి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆయన కుమారుడు కూడా ఈ స్థలాన్ని గాలికొదిలేశారు. దీంతో 40 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న రూ.65 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న షేక్ పేట్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 11, 2026

T20WC: ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే?

image

కొలంబోలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 45 రన్స్‌తో స్టొయినిస్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇంగ్లిస్(37), రెన్షా(37) రాణించారు. మార్క్ ఆదైర్ 2 వికెట్లు తీసుకున్నారు. ఐర్లాండ్ గెలవాలంటే 183 పరుగులు చేయాలి.

News February 11, 2026

రాహుల్ ఆరోపణలకు హర్దీప్ సింగ్ కౌంటర్

image

లోక్‌సభలో LoP రాహుల్ గాంధీ తనపై చేసిన <<19111987>>వ్యాఖ్యలన్నీ<<>> అబద్ధాలేనని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కొట్టిపారేశారు. ‘3 లక్షల ఈమెయిల్స్‌లో నా గురించి 4 లైన్లే ఉంది. మేకిన్ ఇండియా చర్చల్లో భాగంగా అతనితో పలుమార్లు భేటీ అయ్యా. మా మధ్య ఒక మెయిల్ సంభాషణే ఉంది’ అని అన్నారు. గతంలో రాహుల్ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు కూడా అబద్ధమని తేలాయని పురి విమర్శించారు.

News February 11, 2026

లోక్‌సభలో రగడ.. అసలు రాహుల్ ఏమన్నారంటే?

image

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తేవడం రాజకీయ దుమారం రేపింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు అనిల్‌ను పరిచయం చేసిందెవరో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురికి తెలుసు’ అని రాహుల్ వ్యాఖ్యానించడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.