News January 8, 2025

‘పుష్ప-2’కు మ్యూజిక్.. తమన్ క్లారిటీ

image

‘పుష్ప-2’కు మ్యూజిక్ ఇచ్చానని గతంలో చేసిన వ్యాఖ్యలపై సంగీత దర్శకుడు తమన్ స్పష్టతనిచ్చారు. సినిమా రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో BGM ఇవ్వాలని తనను నిర్మాతలు కోరినట్లు తెలిపారు. తాను చేయడం కరెక్టేనా అని అడిగితే అవసరాన్ని బట్టి వినియోగిస్తామని వారు బదులిచ్చినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నంబర్ తీసుకున్నట్లు తెలిపారు. కాగా సినిమాలో సామ్ సి అందించిన BGMను తీసుకున్నారు.

Similar News

News January 9, 2025

అప్పుడే నా వివాహం: అనన్య పాండే

image

ఐదేళ్ల తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని హీరోయిన్ అనన్య పాండే స్పష్టం చేశారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘అందరిలాగే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి నిండా కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు.

News January 9, 2025

తొక్కిసలాట చాలా బాధాకరం: జగన్

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై YCP చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

News January 8, 2025

మూడు గ్రామాలను వణికిస్తోన్న బట్టతల సమస్య

image

MH బుల్దానాలోని బోర్గాం, కల్వాడ్, హింగానా గ్రామాల ప్రజలను జుట్టు రాలుడు సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే చాలా మందికి జుట్టు రాలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామాల్లోని నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. దాదాపు 50 మంది ఈ సమస్యతో వైద్యులను సంప్రదించగా బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. కాగా కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.