News August 26, 2024
అరెస్టైన టెలిగ్రాం సీఈవోకు మస్క్ మద్దతు

టెలిగ్రాం CEO పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్ అరెస్టు చేయడాన్ని బిలియనీర్ ఎలన్ మస్క్ ఖండించారు. అతడిని వెంటనే విడుదల చేయాలన్నారు. ‘స్వేచ్ఛ స్వేచ్ఛ! స్వేచ్ఛ’ అని ఫ్రెంచ్‌లో ట్వీట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలలు పీడితులవుతున్నా దాని యజమాని జుకర్‌బర్గ్‌ను మాత్రం అరెస్టు చేయడం లేదన్నారు. ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేయడం, ప్రభుత్వానికి లోపాయికారిగా యూజర్ల డేటా ఇవ్వడమే ఇందుకు కారణాలని ఆరోపించారు.
Similar News
News October 31, 2025
దేశంలో పెరిగిన ఫేక్ రూ.500 నోట్లు

₹2,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ₹500 ఫేక్ నోట్లు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ డేటాలో వెల్లడైంది. FY23లో 91,110, FY24లో 85,711 ఫేక్ నోట్లను గుర్తించగా, FY25లో ఆ సంఖ్య 1,17,722కు పెరిగింది. ₹2వేల నోట్లు చెలామణిలో ఉన్నప్పుడు, ఉపసంహరణ సమయంలో ఆ నకిలీ కరెన్సీనే ఎక్కువగా ఉండేది. FY23లో 9,806, FY24లో 26,035, FY25లో 3,508 దొంగ నోట్లు ఉండేవి. ₹2వేల నోట్లు రద్దవగానే ₹500 నోట్ల నకిలీ కరెన్సీ పెరిగింది.
News October 31, 2025
దేశాన్ని విడగొట్టింది జిన్నా, సావర్కర్లే: దిగ్విజయ్ సింగ్

దేశాన్ని1947లో రెండుగా విడగొట్టింది మహ్మద్ అలీ జిన్నా (పాకిస్థాన్ ఫౌండర్), హిందూ సిద్ధాంత కర్త VD సావర్కర్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. నాడు వారిద్దరు అలా చేస్తే నేడు బీజేపీ నగరాలను, పక్కనున్న వారినీ విడదీస్తోందని దుయ్యబట్టారు. SIR పేరిట పౌరసత్వ ఆధారాలను BLOలు సేకరిస్తున్నారని మండిపడ్డారు. 4సార్లు ఓట్లేసిన వారి పేర్లను ఫిర్యాదు లేకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
News October 31, 2025
రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చేయండి: ఫ్యాన్స్

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తమతో కొనసాగుతారని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ మొదలుపెట్టారు. ముంబైలో కొనసాగేందుకు తిరిగి జట్టు పగ్గాలు హిట్ మ్యాన్‌కు అప్పగించాలని SMలో డిమాండ్ చేస్తున్నారు. ‘కేవలం రోహిత్ సారథ్యంలోనే ముంబై కప్పు కొట్టగలదు. కెప్టెన్సీతో అతనికి తగిన గౌరవం ఇవ్వాలి’ అని కామెంట్స్ చేస్తున్నారు.


