News March 1, 2025
మరోసారి తండ్రైన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, శివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు.
Similar News
News March 1, 2025
కడప రిమ్స్‌కు పోసాని

AP: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన నటుడు పోసాని కృష్ణమురళికి జైలులో అస్వస్థతకు గురవ్వగా రాజంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఈసీజీ పరీక్షలో వైద్యులు స్వల్ప తేడాలు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
News March 1, 2025
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. GD నెల్లూరులో మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందజేస్తాం. జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని పునరుద్ఘాటించారు.
News March 1, 2025
టన్నెల్ ఘటన.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

TG: శ్రీశైలం SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ను కట్ చేస్తున్నారని, మనుషులు ఉన్నట్లుగా ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నలుగురు సిబ్బంది TBM కింద ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. పనులు వేగంగా జరగడం లేదని విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు.