News June 8, 2024
ప్రధాని మోదీకి మస్క్ అభినందనలు
ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోదీకి టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ Xలో అభినందనలు తెలియజేశారు. భారత్‌లో తన సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో టెస్లా ప్లాంట్ సహా పలు వ్యాపారాలపై ప్రధాని మోదీని ఏప్రిల్‌లోనే కలవాల్సి ఉన్నా ఆఖరి నిమిషంలో మస్క్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే దీనిపై అప్పట్లో స్పందించిన మస్క్, ఈ ఏడాదిలో తప్పకుండా భారత్ వస్తానన్నారు.
Similar News
News November 29, 2024
150వ టెస్ట్ మ్యాచులో డకౌట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌కు తన 150వ టెస్ట్ మ్యాచులో నిరాశ ఎదురైంది. NZతో తొలి టెస్టులో ఆయన డకౌట్ అయ్యారు. దీంతో AUS మాజీ క్రికెటర్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ సరసన చేరారు. వీరిద్దరూ తమ 150వ టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగారు. 2002లో PAKపై స్టీవ్, 2010లో ENGపై పాంటింగ్ 150th టెస్ట్ ఆడారు. రూట్ కంటే ముందు 10 మంది క్రికెటర్లు 150 టెస్టులు ఆడిన ఘనతను అందుకున్నారు. అత్యధిక టెస్టులు సచిన్(200) ఆడారు.
News November 29, 2024
బూడిద చిచ్చు.. నేడు సీఎం వద్ద పంచాయితీ
AP: RTPPలో ఉత్పత్తయ్యే పాండ్ యాష్(బూడిద) తరలింపు విషయంలో BJP MLA ఆదినారాయణరెడ్డి, TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన గొడవ కొలిక్కి రాలేదు. దీంతో వారికి సీఎంవో నుంచి పిలుపువచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. RTPP నుంచి వేల టన్నుల బూడిద విడుదలవుతోంది. దీన్ని సిమెంట్ కంపెనీలకు తరలించడానికి తమకు వాటాలు కావాలని ఇరు వర్గాలు భీష్మించుకున్నాయి.
News November 29, 2024
వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు
AP: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఓ గార్డెన్స్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేయగా రాత్రి 11 గం.కు పోలీసులు సోదాలు చేపట్టారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.