News April 24, 2024
మస్క్ ఓ పొగరుబోతు: ఆస్ట్రేలియా ప్రధాని
ట్విటర్ అధినేత మస్క్‌పై ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడ్నీలో బిషప్‌పై దాడికి సంబంధించిన పోస్టుల్ని చూపించొద్దని ఆ దేశ కోర్టు ట్విటర్‌ను ఆదేశించింది. దీంతో ఆస్ట్రేలియాలో పోస్టుల్ని ఆపేసిన ట్విటర్, ప్రపంచవ్యాప్తంగా కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఆల్బనీస్ మండిపడ్డారు. ‘ఈ పొగరుబోతు కోటీశ్వరుడు తాను చట్టానికి అతీతుడినని అనుకుంటున్నాడు. మేమేం చేయాలో అది చేస్తాం’ అని హెచ్చరించారు.
Similar News
News November 20, 2024
నేరాలు చేస్తే తాట తీస్తాం: చంద్రబాబు
AP: కరడుగట్టిన నేరస్థులకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. ‘గత ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు ఎక్కువయ్యాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయి. అందుకే వాటిపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇకపై ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అదే చేస్తాం’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
News November 20, 2024
సైబర్ బాధితుడికి పరిహారం ఇవ్వాలని SBIని ఆదేశించిన ఢిల్లీ HC
సైబర్ దాడికి గురైన బాధితుడికి పరిహారం ఇవ్వాలంటూ SBIని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హరే రామ్ సింగ్ సైబర్ మోసానికి గురై, వెంటనే దగ్గర్లోని SBIకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సిబ్బంది 2 నెలల తర్వాత అతడి అభ్యర్థనను తిరస్కరించారు. అతడు ఫ్రాడ్ లింక్ ఓపెన్ చేయడం, OTP చెప్పడాన్ని సాకుగా చూపారు. అయితే SBIది నిర్లక్ష్యమైన స్పందనగా పేర్కొన్న HC ₹2.6లక్షలు బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.
News November 20, 2024
ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్?
TG: ముగ్గురు సంతానం ఉన్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అటు APలో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీకి అవకాశం కల్పించింది.