News January 11, 2025
మస్క్ పిచ్చివాడవుతున్నారు: బయోగ్రఫీ రచయిత

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండేకొద్దీ పిచ్చివాడవుతున్నారని ఆయన జీవిత కథ రాస్తున్న అబ్రామ్సన్ ఆరోపించారు. మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మస్క్‌కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బయోగ్రాఫర్‌గా గడచిన రెండేళ్లుగా మస్క్ ఆన్లైన్ ప్రవర్తన నిశితంగా చూస్తున్నాను. భారీగా డ్రగ్స్ వాడకం, ఒత్తిడి కారణంగా ఎలాన్‌కు లోలోపల ఏదో తేడా చేసింది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 4, 2025
మొక్కజొన్న కోత, నిల్వలో తేమ ముఖ్యం

మొక్కజొన్న పంట కోత సమయంలో తేమ కీలకమని, రైతులు సరైన సమయంలో కోత చేపడితే మంచి ధర పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. గింజల్లో 25 నుంచి 30 శాతం తేమ ఉన్నప్పుడు కోత చేపట్టి కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. సుమారు 15 శాతం తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. గోదాములలో నిల్వ చేయాలనుకుంటే సుమారు 10 శాతం తేమ ఉన్న గింజలను నిల్వచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 4, 2025
పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాజభవనం గురించి తెలుసా?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఢిల్లీలోని చారిత్రక ‘హైదరాబాద్ హౌస్’ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడిగా పేరొందిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈ రాజ భవనాన్ని కట్టించారు. సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించేందుకు 2L పౌండ్లు(ఇప్పటి లెక్కల్లో ₹170 కోట్లు) ఖర్చు చేశారు. 8.6 ఎకరాల ప్యాలెస్‌లో 36 గదులు, మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు వంటివెన్నో ఉన్నాయి. ఎంతో మంది దేశాధినేతలు ఇక్కడ ఆతిథ్యం స్వీకరించారు.
News December 4, 2025
ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.


