News June 23, 2024
మరో బిడ్డకు తండ్రయిన మస్క్.. మొత్తం 12 మంది!

బిలియనీర్ ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో కలిసి మూడో బిడ్డకు జన్మనిచ్చినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వీరికి ఇప్పటికే కవలలు ఉన్నారు. 52 ఏళ్ల ఈ టెక్ దిగ్గజం పలువురు మహిళల ద్వారా 12 మంది(ఐదేళ్లలో ఆరుగురికి)కి తండ్రయినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మాజీ ప్రియురాలు గ్రిమ్స్‌కు ముగ్గురు, మాజీ భార్య జస్టిన్‌కు ఆరుగురు, శివోన్‌కు ముగ్గురు పిల్లలు పుట్టారట.
Similar News
News December 28, 2025
శబరిమల ఆలయం మూసివేత.. రీఓపెన్ ఎప్పుడంటే?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజా కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న 5PMకు ఆలయం తెరుస్తామని చెప్పింది. మరోవైపు ఇప్పటిదాకా 30 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ₹333 కోట్ల ఆదాయం టెంపుల్‌కు వచ్చింది.
News December 28, 2025
ఉక్రెయిన్ ఒప్పుకోకున్నా మా ‘లక్ష్యం’ సాధిస్తాం: పుతిన్

రెండు దేశాల మధ్య వివాదాన్ని శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ త్వరపడటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఇందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యేక సైనిక చర్య ద్వారా బలవంతంగానైనా అన్ని లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు. 500 డ్రోన్లు, 40 మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కమాండ్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా సైనిక దుస్తుల్లో పుతిన్ కనిపించారు.
News December 28, 2025
బుల్డోజర్ వివాదం.. సీఎం Vs సీఎం

బెంగళూరులో ఇళ్ల కూల్చివేత కర్ణాటక, కేరళ CMల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ‘నార్త్ బుల్డోజర్ జస్టిస్’ను కర్ణాటక అనుసరిస్తోందని కేరళ CM విజయన్ ఆరోపించారు. ముస్లిం ఇళ్ల కూల్చివేతలు మైనారిటీ వ్యతిరేక రాజకీయాలకు ఉదాహరణని మండిపడ్డారు. ‘ఆయనవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు. వాస్తవ పరిస్థితిపై అవగాహన లేకుండా మాట్లాడారు. బుల్డోజర్ న్యాయానికి, ఆక్రమణల తొలగింపునకు తేడా ఉంది’ KA CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు.


