News November 13, 2024
ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్, రామస్వామి

డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సమర్థత శాఖ(Department of Government Efficiency)కి వీరు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘అధిక నిబంధనల తొలగింపు, వృథా ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ సంస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. సర్కారు వనరుల్ని వృథా చేస్తున్నవారికి నా నిర్ణయం కచ్చితంగా షాకిస్తుంది’ అని ట్రంప్ తెలిపారు.
Similar News
News December 3, 2025
జనాభా పెంచేలా చైనా ట్రిక్.. కండోమ్స్‌పై ట్యాక్స్!

జననాల రేటు తగ్గుతుండటంతో చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా కండోమ్ ట్యాక్స్ విధించనుంది. జనవరి నుంచి కండోమ్ సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13% VAT విధించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్ తొలగిస్తోంది. కాగా 1993 నుంచి కండోమ్స్‌పై అక్కడ వ్యాట్ లేదు.
News December 3, 2025
APPLY NOW: 252 అప్రెంటిస్ పోస్టులు

<<-1>>RITES<<>>లో 252 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ, BE, B.Tech, బీఆర్క్, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 146 ఉండగా.. డిప్లొమా అప్రెంటిస్‌లు 49, ITI ట్రేడ్ అప్రెంటిస్‌లు 57 ఉన్నాయి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్సైట్: https://www.rites.com/
News December 3, 2025
రూ.2లక్షలు క్రాస్ చేసిన KG వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి చాలారోజులకు రూ.2లక్షల మార్కును దాటింది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.2,01,000గా ఉంది. అటు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,30,580గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.119700 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


