News September 10, 2024
ట్రంప్ ఓడితే.. అమెరికన్లకు మస్క్ హెచ్చరిక

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ఇవే ఆఖరి అసలు సిసలైన ఎన్నికలు అవుతాయని బిలియనీర్ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. కోటిన్నర మంది అక్రమ వలసదారుల్ని సక్రమం చేసేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరింత మందిని తీసుకొచ్చి వారు స్వింగ్ స్టేట్స్ గెలిచి అమెరికాను ఏకపార్టీ రాజ్యంగా మార్చేస్తారని తెలిపారు. 1986 ఆమ్నెస్టీ సంస్కరణలతో కాలిఫోర్నియా ఇలాగే మారిందని గుర్తుచేశారు.
Similar News
News November 22, 2025
అలాగైతే తులం బంగారం, రూ.2,500 ఇచ్చేవాళ్లం: జూపల్లి

TG: పథకాల అమలుపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తులం బంగారం, రూ.2,500 ఏమయ్యాయంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు బంగారం ఇవ్వాలంటే మరో రూ.లక్ష అవుతుంది. తులం బంగారం అమలుకు రూ.4వేల కోట్లు, మహిళలకు రూ.2,500 ఇవ్వడానికి రూ.10వేల కోట్లు కావాలి. ఏడాదికి రూ.75వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. BRS అప్పులు చేయకుండా ఉండి ఉంటే పథకాలన్నీ అమలయ్యేవి’ అని అన్నారు.
News November 22, 2025
కమిటీల నిర్మాణం, కూర్పుపై జనసేన ఫోకస్: హరిప్రసాద్

AP: పార్టీ బలోపేతంపై JSP చీఫ్ పవన్ ఫోకస్ పెట్టినట్లు పార్టీ ముఖ్యనేత హరిప్రసాద్ తెలిపారు. ‘కమిటీల నిర్మాణంపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పవన్ దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్టీ శ్రేణుల మనోగతం, సూచనలను కార్యాలయ కమిటీ నమోదు చేస్తోంది’ అని పేర్కొన్నారు.
News November 22, 2025
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్

శిక్ష అనుభవించడానికి రెడీ అవుతున్న కొద్ది రోజుల ముందే బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారోను శనివారం అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున హౌస్ అరెస్ట్‌లో ఉండి శిక్ష అనుభవిస్తారని సుప్రీంకోర్టులో శుక్రవారం లాయర్లు పిటిషన్ వేశారు. 2022 ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరుగుబాటుకు ప్రయత్నించిన బోల్సొనారోకు కోర్టు 27 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష విధించింది. తీర్పును సవాలు చేస్తూ వేసిన అప్పీల్‌ను కొట్టేసింది.


