News October 27, 2024
‘అమెరికాలో మస్క్ అక్రమంగా పనిచేశారు’

కెరీర్ తొలినాళ్లలో ఎలాన్ మస్క్ అమెరికాలో అక్రమంగా పనిచేశారని Washington Post కథనాన్ని ప్రచురించింది. సౌతాఫ్రికాకు చెందిన మస్క్ 1995లో స్టాన్ఫోర్డ్ నుంచి డ్రాపౌట్ అయ్యాక Zip2 సంస్థలో 4ఏళ్ల పాటు చట్టవిరుద్ధంగా అమెరికాలో పనిచేసినట్టు తెలిపింది. 1997లో మస్క్ వర్క్ ఆథరైజేషన్ పొందారని అతని మాజీ సహచరులు వెల్లడించారంది. స్టూడెంట్ వీసాతో ఓవర్ స్టే సహజమే అయినా, అది అక్రమమని పేర్కొంది.
Similar News
News December 3, 2025
‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.
News December 3, 2025
‘కాటన్ ష్రెడర్’తో మరిన్ని ప్రయోజనాలు

కాటన్ ష్రెడర్‌తో తక్కువ ఇంధనంతోనే మొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేయవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల నేలసారం పెరగడంతో పాటు నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం భూమికి పెరుగుతుంది. మట్టి సేద్యానికి అనువుగా, వదులుగా మారుతుంది. నేల కోతను తగ్గించవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల గులాబీ పురుగు ఉద్ధృతిని చాలా వరకు తగ్గుతుంది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధి చెందుతుంది.
News December 3, 2025
భారత్ ముక్కలైతేనే బంగ్లాదేశ్‌కు శాంతి: అజ్మీ

బంగ్లా మాజీ ప్రధాని హసీనాను అప్పగించడంపై భారత్-బంగ్లా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఇలాంటి తరుణంలో బంగ్లా ఆర్మీ మాజీ జనరల్, జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ ముక్కలవ్వకుండా ఉన్నంతకాలం బంగ్లాలో శాంతి నెలకొనదు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. 1971 లిబరేషన్ వార్‌లో హిందువులు, ప్రో లిబరేషన్ బెంగాలీల ఊచకోతకు ఇతని తండ్రే కారణం.


