News January 3, 2025
స్టాలిన్ సినిమా డైలాగ్‌తో మస్క్ స్టేట్మెంట్ సింక్ అవుతోందట!
స్టాలిన్ సినిమాలో నువ్వు చేయి నరకడం తప్పు కాదు, కానీ నరికిన చోటు తప్పు అని చిరంజీవిని ప్రకాశ్‌రాజ్ వారిస్తారు. అలాగే లాస్ వెగాస్‌లో టెస్లా సైబర్‌ట్రక్‌ను ముష్కరులు పేల్చేశారు. దీంతో నిందితులు కారును తప్పుగా ఎంచుకున్నారని <<15044521>>మస్క్<<>> అన్నారు. అయితే నువ్వు బాంబు పేల్చడం తప్పు కాదు, దాని కోసం సైబర్‌ట్రక్‌ను ఉపయోగించడమే తప్పు అన్నట్టుగా మస్క్ స్టేట్మెంట్ ఉందని కామెంట్లు పేలుతున్నాయి.
Similar News
News January 5, 2025
ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఫిక్స్?
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ‘డ్రాగన్’(ప్రచారంలో ఉన్న పేరు)కి హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. విదేశాల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్న NTR ఈ మూవీ కోసం నెలాఖరున కర్ణాటక వెళ్తారని తెలుస్తోంది. అటు హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ నటించిన వార్-2 ఆగస్టులో రిలీజ్ కానుంది.
News January 5, 2025
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పుడంటే?
తెలంగాణలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా అకడమిక్ క్యాలెండర్లో జనవరి 13 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చారు. జనవరి 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో వరుసగా 7 రోజులు వచ్చే అవకాశం ఉంది. సెలవులపై కొంత గందరగోళం నెలకొనడంతో త్వరలోనే సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఇవ్వనున్నారు.
News January 5, 2025
రేపు అకౌంట్లలో డబ్బులు జమ
AP: ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లకు రేపు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాయి. మరోవైపు పింఛన్లను కూడా డిసెంబర్ 31నే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే.