News December 14, 2024
OpenAI విజిల్ బ్లోయర్ సుచిర్ సూసైడ్పై డౌట్లు పెంచిన మస్క్ ట్వీట్!

OpenAI మాజీ ఉద్యోగి, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ కంపెనీ కాపీరైట్, ఫెయిర్ యూజ్ నిబంధనలు పాటించడం లేదని అతడు బ్లాగులో ఆరోపించడం గమనార్హం. OpenAIతో విభేదించి బయటకొచ్చిన ఎలాన్ మస్క్ సుచిర్ మృతిపై ‘Hmmm’ అంటూ చేసిన ట్వీట్ సందేహాలు రేకెత్తిస్తోంది. ఘటనా స్థలంలో అనుమానాస్పద కదలికలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
News December 10, 2025
తాజా సినీ ముచ్చట్లు

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి
News December 10, 2025
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.


