News September 17, 2024
లడ్డూ గెలుచుకున్న ముస్లిం జంట.. KTR అభినందనలు!
కులమతాలకు అతీతంగా సాగే వినాయక చవితి ఉత్సవాల్లో ఓ ముస్లిం కుటుంబం వేలంలో లడ్డూ గెలుచుకుంది. సదరు కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘వినాయక చవితి అంటేనే గంగా జమునా తహజీబ్. ఆసిఫాబాద్‌లోని భట్పల్లిలో గణేష్ లడ్డూ గెలుచుకున్న ఆసిఫ్ భాయ్‌కి కంగ్రాట్స్. శాంతియుత, సామరస్యపూర్వక తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రార్థించండి. అసలైన తెలంగాణ సంస్కృతి ఇదే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Similar News
News December 22, 2024
అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి
అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అర్జున్ అక్కడికి వెళ్లారని చెప్పారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
News December 22, 2024
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ
వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
News December 22, 2024
భారత్‌ను బలవంతం చేయలేరు: జైశంకర్
భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.