News October 24, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు

image

AP: వక్ఫ్ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకించాలని ఆలిండియా ముస్లిం లా బోర్డు, పలు ముస్లిం సంఘాలు సీఎం చంద్రబాబుని కోరాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎంని కలిసి వినతిపత్రం అందించాయి. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. 2026 మార్చి కన్నా ముందే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.

Similar News

News October 24, 2024

కలుషిత నీరే కారణం.. గుర్లలో డయేరియాపై నివేదిక

image

AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.

News October 24, 2024

పోలీసుల్ని మర మనుషుల్లా చూస్తున్నారు: ప్రవీణ్ కుమార్

image

TG: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ‘పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి మర మనుషుల్లా చూస్తున్నారు. నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇస్తామనడం దారుణం. దీనిపై పోలీసుల కుటుంబాలు నల్గొండలో ఆందోళన చేస్తే విధుల్లో ఉన్న పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పోలీసుల్లో అశాంతి నెలకొంది. అది ప్రమాదకరం’ అని అన్నారు.

News October 24, 2024

రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన సికందర్

image

గాంబియాపై జరిగిన T20 మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించారు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ(33 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా నిలిచారు. దీంతో 35 బంతుల్లో శతకం బాదిన రోహిత్ శర్మ, మిల్లర్‌ల రికార్డును బ్రేక్ చేశాడు. ICC మెన్స్ టీ20 WC సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలియర్స్‌లో నిన్న గాంబియాపై తలపడిన జింబాబ్వే 344 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సాధించింది.