News August 29, 2024

అస్సాంలో ముస్లిం వివాహాల బిల్లుకు ఆమోదం

image

ముస్లింలు తమ వివాహాలు, విడాకులను ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా నమోదు చేయాలంటూ రూపొందించిన బిల్లును అస్సాం అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం ద్వారా క్వాజీ వ్యవస్థను తొలగించడం, బాల్య వివాహాలను నిరోధించడం లక్ష్యమని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ చట్టం ముస్లింల వ్యక్తిగత చట్టాన్ని ప్రభావితం చేయదన్నారు. అస్సాం ముస్లిం వివాహాలు&విడాకుల నమోదు చట్టం 1935 స్థానంలో ఈ కొత్త చట్టం వచ్చింది.

Similar News

News December 5, 2025

TG కోసం శ్రీకాంత చారి.. BCల కోసం ఈశ్వర చారి!

image

తెలంగాణ నేలపై ఉద్యమ జ్వాల ఎప్పటికీ చల్లారదు. హక్కుల కోసం ప్రాణాలు పణంగా పెట్టే సాహసమే ఈ మట్టి మనుషుల స్వభావం. 2009లో ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీకాంత చారి చేసిన ఆత్మాహుతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అదే జ్వాల మళ్లీ రాజుకుంది. BCలకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహంతో కూకట్‌పల్లికి చెందిన సాయి ఈశ్వర చారి గురువారం తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు.*హక్కుల కోసం ఆత్మహత్య చేసుకోవద్దు.. బతికి సాధించాలి.

News December 5, 2025

హోంలోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్

image

RBI <<18475069>>నిర్ణయంతో<<>> హోంలోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1శాతానికి పడిపోనుంది. గృహరుణాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీరూ హోం లోన్ తీసుకుంటున్నారా?

News December 5, 2025

కులాల కుంపట్లలో పార్టీలు.. యువతా మేలుకో!

image

తెలంగాణ పోరులో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిమితమైతే శ్రీకాంతాచారి సహా ఎంతో మంది సామాన్యులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు BC రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల కుంపట్లను రాజేసి చలికాచుకునే పనిలో అన్నిపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరాచారి <<18478689>>ఆత్మహత్యే<<>> ఇందుకు నిదర్శనం. అవకాశవాద నాయకుల ఉచ్చులో పడకుండా యువత సంయమనం పాటించాలి. డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయండి.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.