News April 25, 2024
కర్ణాటకలో ముస్లింలూ ఓబీసీలే: NCBC

కర్ణాటకలో ముస్లింలు బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లలో భాగం కావడాన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వార్డ్ క్లాసెస్ (NCBC) తప్పుపట్టింది. ‘ముస్లింలు ఓబీసీ పరిధిలోకి వస్తారని కర్ణాటక ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 17 ముస్లిం వర్గాలు కేటగిరీ-1, మరో 19 ముస్లిం వర్గాలు కేటగిరీ-2A పరిధిలోకి వస్తాయి. ముస్లిం వర్గాల్లో నిరుపేదలు ఉన్నా ఆ మతం మొత్తాన్ని వెనుకబడిన వర్గంగా పరిగణించడం సరికాదు’ అని పేర్కొంది.
Similar News
News April 9, 2026
ముగిసిన పోలింగ్.. 2021 రికార్డులు బ్రేక్!

పుదుచ్చేరి, అస్సాం, కేరళంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ మూడు చోట్లా ఓటర్ టర్నౌట్ భారీగా నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పుదుచ్చేరిలో 86.9% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అస్సాంలో 84.4%, కేరళంలో 75% పోలింగ్ నమోదైంది. దీంతో 2021లో నమోదైన <<19607756>>పోలింగ్<<>> రికార్డులు బ్రేక్ అయ్యాయి.
News April 9, 2026
సిల్వర్ రేటూ తగ్గింది!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర కూడా తగ్గింది. కేజీపై రూ.5,000 తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కేజీపై ఏకంగా రూ.10వేలు పెరిగిన సిల్వర్ ఇవాళ రూ.5వేలు తగ్గడం గమనార్హం. ఇక ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2,340 తగ్గి రూ.1,51,480గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పైనా రూ.2,150 తగ్గి 1,38,850కి చేరిన విషయం తెలిసిందే.
News April 9, 2026
ప్రియాంకా చోప్రా బ్యూటీ సీక్రెట్ తెలుసా?

చర్మసౌందర్యానికి చాలా మంది ఫేస్‌వాష్‌లు, క్రీమ్‌లు వాడుతుంటారు. కానీ అవేమీ అవసరం లేదని, శనగపిండితో చేసే ఫేస్‌ప్యాక్ ముఖానికి నిగారింపు ఇస్తుందని నటి ప్రియాంకా చోప్రా తల్లి డా.మధు చోప్రా చెబుతున్నారు. శనగపిండి, పసుపు, వెన్న- పాలు కలిపి చేసిన క్రీమ్, ఇంకాస్త పాలను కలుపుకొని ముఖానికి పూసుకొని 15-20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాను, ప్రియాంక కూడా ఇదే ఫాలో అవుతామని తెలిపారు.


