News February 13, 2025

బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి.. బండి డిమాండ్

image

TG: రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, MLC ఎన్నికల్లో INC మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల ఆధారంగా రిజర్వేషన్లకు BJP వ్యతిరేకమని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల వ్యవహారాన్ని INC ప్రభుత్వం కేంద్రంపై నెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు.

Similar News

News February 13, 2025

‘తండేల్’ కలెక్షన్ల సునామీ

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వాస్తవ ఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కాగా ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో మూవీ యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించనుంది.

News February 13, 2025

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ర్యాలీలు, సభల వంటివాటిపై నిషేధం ఉంటుందని, ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

News February 13, 2025

సీఎం రేవంత్‌ను గద్దె దించే ప్రయత్నం.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

image

TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని కోసం 25 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. మరోవైపు ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

error: Content is protected !!