News July 8, 2024
భార్యాభర్తలకూ బదిలీ తప్పదు!

TG: ఒకేచోట నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నవారిలో భార్యాభర్తలున్నా బదిలీ తప్పదని ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది. వారికి దగ్గరి ప్రాంతాల్లో పోస్టింగులు ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు 2018లో అమలైన విధానమే వర్తిస్తుందని తెలిపింది. ‘స్పౌజ్’ నిబంధన కింద దంపతుల్లో ఒకరు నగరంలో మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తుంటే.. నగరంలో పని చేసే వారినే గ్రామీణ ప్రాంతాలకు మార్చవచ్చని నిబంధనల్లో ఉంది.
Similar News
News November 26, 2025
డైరెక్టర్ సంపత్ నంది తండ్రి కన్నుమూత

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి కిష్టయ్య(73) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంపత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘చిన్నప్పుడు జబ్బు చేస్తే నన్ను భుజంపై 10KM మోసుకెళ్లింది మొన్నే కాదా అనిపిస్తోంది. నీకు నలుగురు పిల్లలున్నారు. వాళ్లకీ బిడ్డలున్నారు. ఏ కడుపునైనా ఎంచుకో. ఏ గడపనైనా పంచుకో. కానీ మళ్లీ రా’ అని రాసుకొచ్చారు.
News November 26, 2025
ఆస్పత్రి నుంచి స్మృతి తండ్రి డిశ్చార్జ్.. పెళ్లిపై ప్రకటన ఉంటుందా?

మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు యాంజియోగ్రఫీ సహా అన్ని టెస్టులు పూర్తయ్యాయని, ఎక్కడా బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. మరోవైపు స్మృతి పెళ్లిపై వెలువడుతున్న ఊహాగానాలకు కుటుంబం సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ బయటకు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం <<18385575>>తెలిసిందే.<<>>
News November 26, 2025
స్టూడెంట్స్ అసెంబ్లీ.. దద్దరిల్లుతున్న సభ

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరుగుతున్న ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ వాడివేడిగా జరుగుతోంది. విద్యార్థులు మంచి అంశాలపై చర్చ జరుపుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. మంత్రులు వీటికి దీటుగా బదులిస్తున్నారు. లోకేశ్, పవన్ కళ్యాణ్ పాత్రలు పోషిస్తున్న చిన్నారులు పంచ్ డైలాగులతో సమాధానాలు ఇస్తున్నారు. సభ పక్కదారి పట్టకుండా స్పీకర్(అమ్మాయి) అదుపు చేస్తున్నారు.


