News November 17, 2024
కన్నడ నేర్చుకోవాల్సిందే: ZOHO CEO
బెంగళూరులో నివసించే ఇతర రాష్ట్రాల వారు కచ్చితంగా కన్నడ నేర్చుకోవాలని ZOHO CEO శ్రీధర్ వేంబు వ్యాఖ్యానించారు. భాష నేర్చుకోకపోతే అది స్థానికతను అగౌరవపరచడమే అవుతుందన్నారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. రోజూ వెయ్యి పనులు చేయాల్సిన పరిస్థితిలో ఏదైనా కొత్తగా నేర్చుకొనే విధానం ఆర్గానిక్గా ఉండాలని ఒకరు, చుట్టూ 90% ఇతర రాష్ట్రాల వారే ఉంటే కొత్త భాష ఎలా సాధ్యమంటూ మరొకరు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2024
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోంది: ఖర్గే
మణిపుర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ BJPని కాంగ్రెస్ నిలదీసింది. బీజేపీ పాలనలో ‘మణిపుర్ ఐక్యంగా లేదు, సురక్షితంగా లేదు’ అని ఖర్గే విమర్శించారు. 2023 నుంచి జరుగుతున్న హింస ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. ద్వేషపూరిత రాజకీయాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మణిపుర్ తగలబడాలని BJP చూస్తోందని ఖర్గే ఆరోపించారు.
News November 17, 2024
ఎక్కువ సేపు కూర్చుంటే త్వరగా ముసలితనం
ఎక్కువ సేపు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిందే. వీరిలో అకాల వృద్ధాప్యం, గుండె జబ్బులు, మానసిక సమస్యలు వస్తాయని US సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. దాదాపు 1,000 మందిపై వీరు పరిశోధన చేశారు. పని తర్వాత నామమాత్రపు వాకింగ్ చేస్తే సరిపోదని, తీవ్రత ఉండాలని అంటున్నారు. రోజూ 30min రన్నింగ్/సైక్లింగ్ చేసే వారి వయసు 5-10ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.
News November 17, 2024
ట్రంప్ దిగిపోయేవరకూ మా నౌకలో ఉండండి.. సంస్థ ఆఫర్!
అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే దేశం వదిలి వెళ్లిపోతామంటూ USలో చాలామంది ప్రముఖులు ఎన్నికలప్పుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన ఫార్చూన్ అనే ఓ క్రూయిజ్ షిప్ సంస్థ దీన్ని వ్యాపారావకాశంగా మలచుకుంది. ట్రంప్ పదవీకాలం ముగిసేవరకూ తమ క్రూయిజ్ షిప్లో ప్రపంచమంతా తిరగమని ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి 40వేల డాలర్లు చెల్లిస్తే చాలని పేర్కొంది. మరి ఈ ఆఫర్ను ఎంతమంది తీసుకుంటారో చూడాలి.