News April 3, 2024

SRHvsCSK మ్యాచ్‌కు ముస్తాఫిజుర్ దూరం?

image

T20 వరల్డ్ కప్ USA వీసా ప్రాసెసింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఢాకాలో వీసా ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నారు. అయితే, ఈనెల 5వ తేదీన జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ వరకు ఇండియాకు రాకపోవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో టీ20 ప్రపంచకప్‌ అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుంది.

Similar News

News January 19, 2026

20 ఏళ్లుగా చెబుతున్నా వినలేదు.. ఇక టైమ్ వచ్చింది: ట్రంప్

image

గ్రీన్‌లాండ్‌ విషయంలో డెన్మార్క్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు ముప్పు ఉందని 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు నాటో చెబుతోంది. కానీ ఈ విషయంలో డెన్మార్క్ ఏమీ చేయలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. అది జరిగి తీరుతుంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్‌లాండ్‌ తమకు చాలా ముఖ్యమని, <<18784880>>అవసరమైతే సైన్యాన్ని<<>> వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం తెలిసిందే.

News January 19, 2026

పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

image

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?

News January 19, 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>బ్యాంక్<<>> ఆఫ్ బరోడా 4 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in