News November 16, 2024

MP మీటింగ్‌లో మటన్ గొడవ.. కొట్టుకున్నారు

image

UPలోని మిర్జాపుర్‌లో BJP MP వినోద్ కుమార్ బింద్ కార్యాలయంలో ఓ కమ్యూనిటీ సమావేశం, విందు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది హాజరయ్యారు. విందుకు వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా కేవలం గ్రేవీ వేయడంతో రచ్చ మొదలైంది. తనకు ముక్కలు వేయలేదని వాగ్వాదానికి దిగిన సదరు అతిథి వడ్డించే వ్యక్తి చెంపపై కొట్టడం, తోపులాట జరిగి కొట్టుకున్నారు. ఆ తర్వాత కొందరు కవర్లలో మటన్‌ను నింపుకొని వెళ్లిపోయారు.

Similar News

News October 14, 2025

ప్రధాని కర్నూలు పర్యటనను ఖరారు చేసిన పీఎంవో

image

AP: ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనపై PMO అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. 11.15amకు శ్రీశైలం ఆలయంలో పూజలు చేసి, 12:15pmకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారని పేర్కొంది. 2:30pmకు కర్నూలులో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపనతో సహా రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించింది.

News October 14, 2025

‘స్కాలర్‌షిప్స్ రాలేదు.. జీతాలు ఇవ్వలేం’

image

TG: ఉన్నత విద్యాసంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాయి. దాదాపు 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌లు విడుదల కాలేదని, వచ్చిన తర్వాతే ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే 50% కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం Way2Newsకు గోడు వెల్లబోసుకుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అడ్మిషన్లూ కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.

News October 14, 2025

దీపావళి.. శునకాలకు ప్రత్యేక పూజలు చేస్తారు!

image

నేపాల్‌లో దీపావళి సందర్భంగా ఐదు రోజుల తిహర్ జరుపుకుంటారు. ఇందులో భాగంగా రెండో రోజు శునకాలను పూజిస్తుంటారు. మానవుల పట్ల శునకాలు చూపించే విశ్వసనీయతకు కృతజ్ఞతలు చెప్పడానికి దీనిని పాటిస్తారు. వీధి, పెంపుడు కుక్కలనే తేడా లేకుండా అన్ని శునకాలకూ పూలమాలలు వేసి నుదిటిపై తిలకం దిద్దుతారు. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించి గౌరవిస్తారు. ఈ సంస్కృతి నేపాలీ ప్రజల జంతు ప్రేమను చాటుతుంది.