News November 2, 2024

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్‌కు బదిలీ

image

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Similar News

News December 27, 2024

నిజాయితీ, నిరాడంబరతే మన్మోహన్ కిరీటాలు

image

మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో నిజాయితీ, నిరాడంబర జీవితాన్ని గడిపారు. మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రత్యర్థుల మన్ననలు సైతం పొందారు. ప్రజా జీవితంలో పాటించాల్సిన విలువలకు ఆయన నిదర్శనంగా నిలిచారు. ఎవరిపైనా చిన్న దూషణ, తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఆర్థిక, పాలనా అంశాల్లో సమగ్రమైన అవగాహనతో ఆయన పార్లమెంట్ సహా పలు వేదికల్లో చేసిన ప్రసంగాలు ఎంతో మందికి పాఠ్యపుస్తకాల్లాంటివి.

News December 27, 2024

రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్

image

ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయింది. అయితే ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.

News December 27, 2024

విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.