News December 22, 2024
ప్రశ్నార్థకంగా MVA మనుగడ!
మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల సొంత బలం కోల్పోయామన్న భావనలో 3 పార్టీలున్నాయి. ముఖ్యంగా శివసేన UBT ముంబై నగరంలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతో పునర్వైభవం కోసం కూటమికి దూరం జరుగుతోంది. 2025లో జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
Similar News
News December 22, 2024
ఘోర ప్రమాదం.. 38 మంది మృతి
ఆఫ్రికా దేశం కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 400 మంది ఫెర్రీలో క్రిస్మస్ వేడుకల కోసం స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News December 22, 2024
దేశీయ చాయ్‌కి అమెరికా ‘ఆరోగ్య’ గుర్తింపు
భారతీయులు అమితంగా ఇష్టపడే చాయ్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. దేశీయ తేయాకుగా ప్రసిద్ధి చెందిన కమెల్లియా సైనెన్సిస్‌తో తయారు చేసిన టీని ఆరోగ్యకరమైన పానీయంగా US Food and Drug Administration గుర్తించింది. ఈ నిర్ణయాన్ని నార్త్ ఈస్టర్న్ టీ, ఇండియన్ టీ అసోసియేషన్లు స్వాగతించాయి. అంతర్జాతీయ టీ పరిశ్రమకు ఇదో అద్భుతమైన వార్త అని అమెరికా టీ అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ ఎఫ్ గోగ్గి పేర్కొన్నారు.
News December 22, 2024
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు నోటీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి UPలోని ఓ కోర్టు నోటీసులిచ్చింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ కులగణనపై మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామని అన్నారు. ఆ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, వచ్చే నెల 7న విచారణకు హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది.