News August 18, 2024
ఎన్నికలపై MVA వ్యూహాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహావికాస్ అఘాడీలోని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలకు ఉమ్మడి సర్వే నిర్వహిద్దామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. అయితే ఎన్నికల తర్వాత ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి CM పదవి ఇచ్చే ఫార్ములాను విరమించుకోవాలని శివసేన UBT చీఫ్ ఉద్ధవ్ కోరుతున్నారు. ఈ ఫార్ములా వల్ల ప్రతి పార్టీ తమకు గరిష్ఠ సంఖ్యలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తాయని వాదిస్తున్నారు.
Similar News
News July 7, 2025
జీవితంలో సవాళ్లను స్వీకరించాలి: మంత్రి లోకేశ్

AP: 2019 ఎన్నికల్లో ఓటమి బాధ తనలో కసి పెంచిందని, ఫలితమే 2024 ఎన్నికల్లో మెజార్టీ అని మంత్రి లోకేశ్ చెప్పారు. జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో విద్యాశాఖను తీసుకున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరులో రూ.15 కోట్లతో అధునీకరించిన ప్రభుత్వ స్కూల్‌ను ఆయన సందర్శించారు. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యమని మంత్రి చెప్పారు. అంతకుముందు స్కూళ్లోని తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.
News July 7, 2025
ICC CEOగా సంజోగ్ గుప్తా

ICC CEOగా భారత్‌కు చెందిన సంజోగ్ గుప్తా నియమితులయ్యారు. ఇవాళ్టి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ICC ప్రకటించింది. సంజోగ్ ప్రస్తుతం జియోస్టార్‌లో స్పోర్ట్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ CEOగా ఉన్నారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో B.A పట్టా పొందిన ఆయన జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. టీవీ నెట్‌వర్క్‌లో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ICC CEO పదవి చేపట్టిన ఏడో వ్యక్తిగా నిలిచారు.
News July 7, 2025
జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.