News February 28, 2026
MVRCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్(MVRC)లో 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mrvc.indianrailways.gov.in
Similar News
News February 28, 2026
ఇది ‘యుద్ధ ప్రపంచం’

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐదారు యుద్ధాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అవకాశాన్ని బట్టి ఇటు గాజాలోని హమాస్ మిలిటెంట్లు, అటు లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులు చేస్తోంది. ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై అటాక్ చేశాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా వార్ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ కూడా భీకర పోరాటాలు చేసుకుంటున్నాయి.
News February 28, 2026
మహిళలు ఎక్కువ గంటలు పని చేస్తే?

కెరీర్‌లో కోసం ఎక్కువ గంటలు పని చేయడం వల్ల మహిళలకు ఒత్తిడి, ఆందోళన పెరిగి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం జరగడం, ప్రీమెచ్యూర్ బేబీ, ఎదుగుదల లోపాలు, ప్రీఎక్లాంప్సీయా ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గినా.. ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు.
News February 28, 2026
22,195 ప్రభుత్వ ఉద్యోగాలు.. 2 రోజులే ఛాన్స్

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 2 లాస్ట్ డేట్. సికింద్రాబాద్ పరిధిలో 1,012 పోస్టులున్నాయి. జాబ్‌ను బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/


