News July 13, 2024
కేసీఆర్‌ను జైలుకు పంపడమే నా లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జైలుకు పంపడమే తన లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన్ను గద్దె దించాలన్న ఓ లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని మీడియా సమావేశంలో తెలిపారు. ‘మిగులు బడ్జెట్‌తో మొదలైన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారు. ప్రతీ శాఖను అవినీతిమయం చేశారు. అందుకే బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ సమాధైనట్లే’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 3, 2025
దైవారాధనకు ఉత్తమ దిక్కు ఏదంటే?

సూర్యభగవానుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి పూజ చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి కూర్చోవడం శ్రేష్ఠమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒకవేళ అది వీలుకాకపోతే, ఇతర దిక్కుల వైపు తిరిగి పూజ చేయవచ్చు. అయితే, దక్షిణం వైపు మాత్రం పూజ చేయకూడదు. ఎందుకంటే, దక్షిణం దిక్కు యమధర్మరాజు దిశ. మరణానికి ప్రతీక. అందుకే పెద్దలు దక్షిణం వైపు చూసి పూజలు, జపాలు చేయడం హానికరం అని చెబుతారు.
News September 3, 2025
సన్‌స్క్రీన్ రోజుకు ఎన్నిసార్లు అప్లై చేయాలంటే..

చర్మ సంరక్షణలో సన్స్క్రీన్ది కీలకపాత్ర. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. ఇది ట్యానింగ్, వృద్ధాప్యఛాయలు రాకుండా చూస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండేవారు 2 గంటలకొకసారి సన్‌స్క్రీన్ రాసుకోవాలి. వేసవిలో వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ వాడటం మంచిది. ప్రస్తుతం వాడే వివిధ రకాల లైట్ల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి ఇండోర్‌లో ఉన్నా సన్‌స్క్రీన్ వాడటం మంచిది.
News September 3, 2025
రామాంజనేయుల మధ్య యుద్ధం.. మీకు తెలుసా?

ఆంజనేయుడికి ఒకనాడు తను నిత్యం కొలిచే రాముడితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గురువు ఆజ్ఞ మేరకు యయాతిని సంహరించాలనుకుంటాడు రాముడు. కానీ, యయాతిని కాపాడతానని హనుమంతుడు మాటిస్తాడు. దీంతో రాముడికి ఎదురు నిలుస్తాడు. ఎలాంటి ఆయుధం లేకుండా, భక్తిని మాత్రమే నమ్ముకుంటాడు. రాముడు ప్రయోగించిన ఏ అస్త్రం కూడా హనుమంతుడి భక్తి ముందు నిలవదు. శక్తి కన్నా భక్తికే ఎక్కువ బలం ఉందని ఈ వృత్తాంతం నిరూపించింది.