News June 13, 2024
‘కల్కి’ ట్రైలర్లో నా ఆర్ట్‌ను వాడుకున్నారు: సంగ్‌చోయ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి’ సినిమా ట్రైలర్లో ఇంట్రో సీన్‌ని కాపీ చేశారని హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్‌చోయ్ ఆరోపించారు. కల్కి బృందం తన అనుమతి లేకుండానే తన ఆర్ట్‌వర్క్‌ను ఉపయోగించిందని ఆయన ఇన్‌స్టా వేదికగా మండిపడ్డారు. 10 ఏళ్ల క్రితం తాను క్రియేట్ చేసిన ఆర్ట్‌తో ట్రైలర్‌లోని VFX షాట్‌ను ఆయన కంపేర్ చేస్తూ పోస్ట్ చేశారు. దీనిపై ‘కల్కి’ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News January 23, 2026
నల్గొండ : M.B.A , M.C.A ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల..

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ ,ఎంసీఏ సెమిస్టర్-1 రెగ్యులర్ కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 23 మధ్య పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News January 22, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. అమెరికాకు CM రేవంత్

TG: ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. 3 రోజుల WEFలో ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని, AI, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ అంశాలపై MoUలు కుదిరాయని వెల్లడించింది. మరోవైపు దావోస్‌లో కార్యక్రమాలు ముగించుకొని CM రేవంత్ <<18905782>>అమెరికా పర్యటన<<>>కు వెళ్తున్నారు.
News January 22, 2026
పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులూ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి హాయిగా నిద్ర పడుతుంది. శరీరంలోని వ్యర్థాల తొలగింపునకు సహాయపడుతుంది. అయితే ఎక్కువగా తాగితే మాటిమాటికీ మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు. గుండె, కిడ్నీ సమస్యలున్నవారు నిద్రకు 1-2 Hr ముందే నీళ్లు తాగడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.


