News November 7, 2024
నా శరీరం సహకరించడం లేదు: సాహా

క్రికెట్ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తెలిపారు. అందుకే రిటైర్మెంట్ పలికానని ఆయన చెప్పారు. ‘నాకెంతో ఇష్టమైన క్రికెట్‌ను ఆస్వాదించలేకపోతున్నా. అందుకే గతేడాదే వీడ్కోలు పలుకుదామనుకున్నా. కానీ సౌరవ్ గంగూలీ, నా భార్య నన్ను మార్చారు. ఈ సీజన్లో రంజీల్లో ఆడాలని సూచించారు. ఈడెన్ గార్డెన్స్‌లో నా చివరి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
సంగారెడ్డి: షూటింగ్ విజేతలకు కలెక్టర్ అభినందనలు

భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్(SGF) క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన షూటింగ్ పోటీలో సంగారెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన వారిని కలెక్టర్ జితేష్ పాటిల్ అభినందించి, ధ్రువపత్రాలు అందజేశారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు.
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News November 21, 2025
మిస్ యూనివర్స్-2025 ఫాతిమా బాష్ గురించి తెలుసా?

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. స్కూల్లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్‌గా నిలిచారు.


