News August 20, 2025
బోల్డ్ సీన్స్‌లో నటించాకే నా కెరీర్ మారింది: తమన్నా

ఇటీవల స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా మెరుస్తున్న హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నో-కిస్ పాలసీని కఠినంగా పాటించడంతో కొన్ని ఆఫర్లు కోల్పోయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్నింటిని పక్కన పెట్టి బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్‌లో నటించడం మొదలు పెట్టాకే తన కెరీర్ టర్న్ అయిందని చెప్పారు. లస్ట్ స్టోరీస్-2, జీ కర్దా వంటి వెబ్‌సిరీస్‌ల్లో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోసు పెంచారు.
Similar News
News August 20, 2025
కన్నీళ్లు పెట్టిస్తున్న PHOTO

TG: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. HYD శివారు బాచుపల్లిలో తల్లి లక్ష్మి తన ఇద్దరు పిల్లల(ఒకరు 8 నెలలు, మరొకరు మూడేళ్లు)ను నీటి సంపులో పడేసింది. అప్పటివరకు ఆనందంగా ఆడుకున్న ఆ చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను వెలికితీయగా ఆ దృశ్యం చూసినవారిని కంటతడి పెట్టిస్తోంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News August 20, 2025
లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నియంత్రించేందుకు రూపొందించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు విముఖత చూపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాల నేతలు వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై చర్చకు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇవాళ ఉదయం కూడా సభ వాయిదా పడింది.
News August 20, 2025
‘ప్రపంచ దోమల దినోత్సవం’ పుట్టుకకు వేదిక సికింద్రాబాద్

బ్రిటిష్ వైద్యుడు సర్ రొనాల్డ్ రాస్ 1897 AUG 20న సికింద్రాబాద్‌లోని మిలిటరీ హాస్పిటల్లో పని చేస్తున్నప్పుడు దోమల్లో మలేరియా ప్లాస్మోడియం ఉనికిని గుర్తించారు. ఇవి మలేరియా వ్యాప్తికి మాధ్యమంగా పనిచేస్తాయని నిరూపించారు. ఈ ఆవిష్కరణ ఆయనకు 1902లో నోబెల్ తెచ్చిపెట్టింది. ఆయన ఆవిష్కరణను స్మరించుకునేందుకే ఈ ప్రపంచ దోమల దినోత్సవం మొదలైంది. ఈ రోజు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా గురించి అవగాహన కల్పిస్తారు.