News May 10, 2024
నా బిడ్డ అమాయకురాలు: కేసీఆర్

మద్యం కుంభకోణంలో తన బిడ్డ కల్వకుంట్ల కవిత అమాయకురాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నిజానికి ఇది మోదీ ఆడుతున్న ఒక క్రూరమైన ఆట. లిక్కర్ స్కామ్ అనేది అసలు స్కామే కాదు. అదొక చెత్త వదంతి. లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కామ్‌ను సృష్టించింది. అసలు ఇది మోదీ చేసిన రాజకీయ కుంభకోణం. కేజ్రీవాల్ కూడా ఈ స్కామ్‌లో అమాయకుడే’ అని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
మొబైల్‌తో వెళ్తే అలాగే కూర్చుండిపోతారు!

మెరుగైన పేగు ఆరోగ్యం కోసం బాత్రూమ్లో ఫోన్ వాడటం ఆపేయాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చూస్తూ ఎక్కువసేపు కూర్చుంటే మలసిరలపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం 46% వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ‘ముఖ్యంగా బాత్రూమ్లో ఫోన్ వాడకండి. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. వెస్ట్రన్ కమోడ్ ఉపయోగిస్తే చిన్న స్టూల్‌పై కాళ్లు ఉంచండి. హ్యాండ్ వాష్ చేసుకోండి ’ అని తెలిపారు.
News October 16, 2025
‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలతో తెరపైకి వచ్చిన ‘డెక్కన్ సిమెంటు’పై చర్చ జరుగుతోంది. సూర్యాపేట(D)లో ఈ కంపెనీ 73 Acr అటవీ భూమిని ఆక్రమించిందని ఫిర్యాదులు రాగా గ్రీన్‌ట్రిబ్యునల్ విచారించింది. అటు కేంద్ర అటవీశాఖ కూడా ఆక్రమణలపై దర్యాప్తు చేయాలని 10 రోజుల క్రితం రాష్ట్రాన్ని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర అటవీశాఖ విచారిస్తోంది. ఆక్రమణ ఏమేరకు ఉందో త్వరలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు.
News October 16, 2025
BREAKING: ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.