News July 12, 2024
‘మా కోడలు వెళ్లిపోయింది’.. అన్షుమాన్ తల్లిదండ్రుల ఆవేదన

అమరవీరుడు కెప్టెన్ <<13575028>>అన్షుమాన్<<>> సింగ్కు ప్రభుత్వం ఇచ్చిన కీర్తిచక్రను తీసుకుని భార్య స్మృతి తమ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. ఎక్స్గ్రేషియా మొత్తాన్ని కూడా ‘నెక్స్ట్ ఆఫ్ కిన్’(తదుపరి సంబంధీకులు) రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసేసుకున్నారని పేర్కొన్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫొటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు స్పందించట్లేదని వాపోయారు.
Similar News
News January 30, 2026
ఈ నూనెలతో స్కిన్ సేఫ్

శీతాకాలం రాగానే చర్మం తన సహజతేమను కోల్పోయి పొడిబారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మొక్కల నుంచి తీసిన నూనెలు వాడాలని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలోని ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మంపై రక్షణ కవచంలా ఏర్పడతాయి. ముఖ్యంగా జొజొబా ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, రోజ్షిప్ ఆయిల్, కొబ్బరి నూనెలు చర్మాన్ని సంరక్షించడంలో కీలకంగా పనిచేస్తాయంటున్నారు.
News January 30, 2026
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు

☛ డబుల్ సెంచరీ: ఇది పొడుగు కొబ్బరి రకం. నాటిన ఆరేళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 130 కాయల దిగుబడి వస్తుంది. ఈ రకం కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గోదావరి గంగ: ఇది హైబ్రిడ్ కొబ్బరి రకం. నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 140-150 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 68 శాతం. ఇవి కొబ్బరి బొండానికి, టెంకాయకు మేలైన రకాలు.
News January 30, 2026
విష్ణుమూర్తిని నేడు ఎలా పూజించాలంటే..?

వరాహ ద్వాదశి నాడు విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. రాగి/ఇత్తడి చెంబులో గంగాజలం నింపి, అక్షితలు, పువ్వులు, మామిడి ఆకులతో అలంకరించాలి. పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని సిద్ధం చేయాలి. ఈ కలశంపై వరాహ స్వామిని ప్రతిష్టించి షోడశోపచార పూజ చేయాలి. స్వామికి పసుపు వస్త్రాలు, తులసి దళాలు, బెల్లం నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. పేదలకు దానాలు చేస్తే తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.


