News January 29, 2025

‘NTRను కలవడమే నా కూతురి చివరి కోరిక’

image

తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని హుజూరాబాద్ (TG)కి చెందిన ఓ క్యాన్సర్ పేషెంట్ కోరుకుంటోంది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన కూతురి చివరి కోరికను తీర్చాలంటూ ఆమె తల్లి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాశారు. ‘నా కూతురు స్వాతి(25) బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడటమే తన చివరి కోరిక. దయచేసి ఆయన్ను కలిపించండి’ అని తల్లి రజిత రాసిన లేఖ వైరలవుతోంది.

Similar News

News November 4, 2025

స్టూడియో ఫ్లాట్స్‌కు పెరుగుతున్న డిమాండ్

image

విశాఖలో స్టూడియో ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరుగుతోందని CREDAI తెలిపింది. టెక్ కంపెనీలు వస్తున్న వైజాగ్‌లో ఇలాంటి అపార్టుమెంట్లు 30 వరకు, అన్నీ ఫుల్ అయ్యాయని పేర్కొంది. 400-600Sft సైజులో లేటెస్ట్ ఫీచర్లతో లివింగ్, కిచెన్, బెడ్ రూం కలిపి ఉండేవే స్టూడియో ఫ్లాట్స్/సర్వీస్ అపార్ట్మెంట్స్. ప్రాజెక్టు పనులపై వచ్చే గెస్ట్ ఉద్యోగులు ఇంటి అనుభూతి కోరుకుంటే.. రోజులు-వారాల కోసం కంపెనీలు వీటిని అద్దెకు తీసుకుంటాయి.

News November 4, 2025

టీ/కాఫీ తాగకపోతే హెడేక్ ఎందుకు వస్తుందంటే?

image

అనుకోకుండా టీ/కాఫీ మానేస్తే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. దీనిపై డాక్టర్ సుధీర్ కుమార్ వివరణ ఇచ్చారు. ‘కాఫీ తాగకపోతే తలనొప్పి రావడం ఊహ కాదు. అది కెఫీన్ విత్‌డ్రాయల్ లక్షణం. అడెనోసిన్ అనే నిద్రమత్తు రసాయనాన్ని కెఫీన్ అడ్డుకుంటుంది. అకస్మాత్తుగా కాఫీ/టీ మానేస్తే అడెనోసిన్ మెదడులోకి వెళ్లి రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో తలనొప్పి, అలసట, చిరాకు వంటివి కనిపిస్తాయి’ అని తెలిపారు.

News November 4, 2025

పిల్లలను జర్మనీకి పంపిస్తున్నారా?

image

జర్మనీకి వెళ్తే సెటిల్ అయిపోవచ్చని అనుకుంటున్న వారికి అక్కడి NRIలు కీలక సూచనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని ఉద్యోగాలు లేక చాలామంది వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ‘కేవలం ఇక్కడి NRIలు చేసే రీల్స్ చూసి గుడ్డిగా రావద్దు. కనీసం 10 మంది అభిప్రాయాలు తీసుకోండి. జర్మన్ భాష నేర్చుకోగలిగితే ఇక్కడ స్థిరపడటం సులభం. కష్టపడటానికి సిద్ధమైతేనే ఈ దేశాన్ని ఎంచుకోండి’ అని సూచిస్తున్నారు.