News March 15, 2025
అలాంటి పాత్రలు చేయాలనేది నా కోరిక: శివాజీ

ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య వంటి నటుల్లా మరుపురాని పాత్రలు చేయాలని ఉండేదని నటుడు శివాజీ అన్నారు. క్రూరమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనేది తన కోరిక అని చెప్పారు. కోర్టు సినిమాలో తన పాత్రకు వస్తున్న ఆదరణ ఆనందాన్ని ఇస్తోందన్నారు. షూటింగ్ సెట్లో నా అరుపులకు అంతా భయపడేవారని తెలిపారు. ప్రస్తుతం లయతో ఓ సినిమాతో పాటు ‘దండోరా’ అనే మరో చిత్రంలో చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 26, 2025
కొత్త ఏడాదిలో ఇవి మారుతాయి!

కొత్త ఏడాదిలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*8వ వేతన సంఘం అమలుపై స్పష్టత రానుంది. ఉద్యోగుల జీతాలు పెరిగే ఛాన్స్.
*పలు బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు, సవరించిన FD రేట్లు జనవరి నుంచి అమల్లోకి.
*బ్యాంకింగ్ సర్వీసులకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి.
*PM కిసాన్ సాయం పొందేందుకు యూనిక్ ID కార్డ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం.
*LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు.
News December 26, 2025
BHELలో అప్రెంటిస్ పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(<
News December 26, 2025
ఫెలోపియన్ ట్యూబ్స్ పని చేయకపోవడానికి కారణాలు

ఫెలోపియన్ ట్యూబ్స్లో సమస్యలు చాలా తక్కువమందిలో కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఇన్ఫెక్షన్లు కలగడం, ట్యూబ్ దెబ్బతినడం లేదా తొలగిపోవడం వల్ల, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల శాశ్వతంగా ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం లేదా ఆ ట్యూబ్ని తీసివేయడం, పుట్టుకతోనే ఫెలోపియన్ ట్యూబ్ అసాధారణ రీతిలో అభివృద్ధి చెందడం, ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ పనిచేయకపోవచ్చంటున్నారు.


