News June 25, 2024
నా కల 50 శాతం నెరవేరింది: నితీశ్

భారత జట్టుకు ఎంపికవడంతో తన కల 50 శాతం నెరవేరిందని తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇండియన్ జెర్సీ ధరించి జట్టుకు విజయాలను అందించినప్పుడే తన కల పూర్తిగా నెరవేరుతుందని తెలిపారు. తన కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డ తండ్రి ముత్యాల రెడ్డిని గర్వపడేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. 2024 IPLలో SRH తరఫున నితీశ్ 11 మ్యాచుల్లో 303 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
శ్రీరాంపూర్: స్ట్రక్చరల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చ

శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులకు మధ్య స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
News November 28, 2025
2027 WCకు రోహిత్, కోహ్లీ.. కోచ్ ఏమన్నారంటే?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీల్లో వారి అనుభవం జట్టుకు కీలకమని అన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటే కచ్చితంగా ఆడతారని తెలిపారు. కాగా గత ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ రాణించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.


