News December 31, 2024
సీత వేషం వేసినందుకు నాన్న బెల్ట్‌తో చావబాదారు: రవికిషన్

చిన్నతనంలో ఎదుర్కొన్న భయానక అనుభవాలను సినీ నటుడు రవికిషన్ పంచుకున్నారు. స్థానికంగా ఓ నాటకంలో తన తల్లి చీరను ధరించి సీత వేషం వేసినందుకు తన తండ్రి బెల్ట్‌తో చావబాదినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.500 ఇచ్చి రైలెక్కి వెళ్లిపొమ్మన్నారని లేకపోతే చంపేస్తా అని బెదిరించినట్లు వెల్లడించారు. దాంతో చిన్న వయసులోనే ముంబైకి వచ్చినట్లు పేర్కొన్నారు. రవికిషన్ తెలుగులో రేసు గుర్రం సినిమాలో నటించారు.
Similar News
News November 27, 2025
ధర్మేంద్ర మృతిపై హేమా మాలిని భావోద్వేగ పోస్ట్

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి తర్వాత ఆయన భార్య హేమామాలిని SMలో తొలి పోస్టు చేశారు. ఆయన మృతితో తన జీవితం శూన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర తనకు భర్త మాత్రమే కాకుండా.. స్నేహితుడు, మార్గదర్శి అని చెప్పారు. కుమార్తెలు ఈషా, అహానాపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర వినయం ఆయనను ఐకాన్‌గా నిలబెట్టిందని తెలిపారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీ జీవితాంతం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 27, 2025
WTC ఫైనల్.. భారత్ చేరుకోవడం కష్టమే!

SAతో టెస్టు సిరీస్‌లో ఓటమితో.. భారత్‌కి 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం 48.15%తో ఐదో స్థానంలో ఉన్న టీమ్ఇండియా.. మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు, 2 డ్రాలు లేదా ఏడు విజయాలు సాధించాలి. ఫైనల్‌కు చేరుకోవాలంటే కనీసం 60% పాయింట్లు అవసరం. శ్రీలంక, న్యూజిలాండ్ విదేశీ టూర్లతో పాటు, ఆస్ట్రేలియాతో 5 హోం టెస్టులు భారత్‌కు కఠిన సవాల్‌గా మారనున్నాయి.
News November 27, 2025
రూ.89కే X ప్రీమియం ఆఫర్

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని X.. ప్రీమియం సేవలను కేవలం రూ.89కే అందిస్తూ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. Grok AI, బ్లూ టిక్ మార్క్, తక్కువ యాడ్స్, రీచ్ ఎక్కువ, క్రియేటర్ మానిటైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. డిసెంబర్ 2 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ప్రీమియం రూ.89కి, ప్రీమియం+ ప్లాన్‌ను రూ.890కి పొందే అవకాశం ఉంది. మొదటి నెల తర్వాత ధరలు మళ్లీ రూ.427 (Premium), రూ.2,570 (Premium+)కి మారుతాయి.


