News December 10, 2024

మా నాన్న మద్దతు ఎప్పుడూ విష్ణుకే : మనోజ్

image

తన తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉన్నారని మనోజ్ అన్నారు ‘నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం, పరువు నష్టం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు. నేను 4నెలల కిందటే ఇంటికి వచ్చాననేది అవాస్తవం. నా ఫోన్ లొకేషన్ చూస్తే ఇది తెలుస్తుంది. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. నా పరువు, మర్యాదలు తీసే ప్రయత్నంలో భాగం’ అని లేఖలో రాశారు.

Similar News

News October 23, 2025

AUSvsIND: అడిలైడ్‌లో అదరగొడతారా?

image

అడిలైడ్ వేదికగా టీమ్ ఇండియా ఇవాళ ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. సిరీస్‌లో నిలవాలంటే తొలి వన్డే ఓడిన గిల్ సేన ఈ మ్యాచులో తప్పక గెలవాలి. అటు కోహ్లీ, రోహిత్ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు తొలి వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా జోరు మీద ఉంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ కఠిన పరీక్ష కానుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News October 23, 2025

అన్నాచెల్లెళ్ల పండుగ.. శుభ సమయం ఏదంటే?

image

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ పర్వదినాన, సోదరీమణుల చేతి భోజనం సోదరులకు దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని పండితులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ దివ్య ఆచరణకు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం అని సూచిస్తున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ భగినీ హస్త భోజన ఘట్టాన్ని ఆచరించడానికి సమయం అనుకూలంగా ఉందంటున్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను దృఢపరుస్తుంది.

News October 23, 2025

మామిడి పంటలో ఈ సమయంలో ఏం చేయాలి?

image

అక్టోబర్ రెండో పక్షంలో మామిడి చెట్టుకు పొటాషియం నైట్రేట్ (మల్టీ.కే లేదా 13-0-45 నీటిలో కరిగే ఎరువు) లీటరు నీటికి 10-15గ్రా మరియు ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా లేదా అర్క మ్యాంగో స్పెషల్ 5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. ఈ పోషకాలు పూమొగ్గలు ఏర్పడటానికి ప్రేరణ కలిగిస్తాయి. ఈ నెలాఖరు నుంచి రైతులు మామిడి చెట్టుకు నీరుపెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే పూతకు బదులు ఆకు ఇగురువచ్చి పంటను కోల్పోవలసి వస్తుంది.