News January 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో నా ఫేవరెట్ టీమ్ పాక్: గవాస్కర్

image

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఫేవరెట్ టీమ్ పాకిస్తాన్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పారు. స్వదేశంలో పాక్‌ను ఓడించడం అంత సులువు కాదని తెలిపారు. స్వదేశంలో ఆడటం ఆ జట్టుకు కలిసొస్తుందన్నారు. గత వరల్డ్‌కప్ ఫైనల్లో అతిథ్య భారత జట్టు ఓడినా టోర్నీ మొత్తం అదిరిపోయే ప్రదర్శన చేసిందని గుర్తు చేశారు. CTకి పాకిస్తాన్, యూఏఈ అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 24, 2026

Grok సేవలకు అంతరాయం

image

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.

News January 24, 2026

అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే..

image

“యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.

News January 24, 2026

గుంటూరు జిల్లాలో 45 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖ 45 <>పోస్టుల<<>> భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, DMLT, BSc(BZC), PG డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, PGDCA అర్హత గలవారు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: guntur.ap.gov.in