News May 26, 2024

నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది: మహేశ్ బాబు

image

కుమారుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వేడుకల ఫొటోలను షేర్ చేస్తూ తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘నీ తర్వాతి చాప్టర్ నువ్వే రాసుకోవాలి. నువ్వు మరింత వెలుగొందుతావని భావిస్తున్నా. నీ కలలను సాకారం చేసుకో. తండ్రిగా నేను ఈ రోజు గర్వపడుతున్నా’ అని గౌతమ్‌ను ఉద్దేశించి ప్రిన్స్ రాసుకొచ్చారు.

Similar News

News October 31, 2025

బాహుబలి యూనివర్స్‌లో కొత్త సినిమా ప్రకటన

image

బాహుబలి యూనివర్స్‌లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్‌ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.

News October 31, 2025

₹39,216 కోట్ల ఒప్పందాలపై విశాఖ పోర్టు సంతకాలు

image

AP: ముంబైలో జరిగిన మారిటైమ్ వీక్-2025 సమావేశాల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ(VPA) ₹39,216 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్&రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం AP ప్రభుత్వంతో ₹29,662 కోట్ల ఒప్పందం చేసుకుంది. మెకాన్ ఇండియాతో ₹3,000 కోట్లు, NBCCతో ₹500 కోట్లు, హడ్కోతో ₹487.38 కోట్లు, రైల్ వికాస్ నియమిటెడ్‌తో ₹535 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది.

News October 31, 2025

వెడ్డింగ్ సీజన్: ₹6.5 లక్షల కోట్ల వ్యాపారం.. కోటి ఉద్యోగాలు

image

నవంబర్ 1 నుంచి వెడ్డింగ్ సీజన్ మొదలు కాబోతోంది. 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రీసెర్చ్‌ అంచనా వేసింది. ఈ పెళ్లి వేడుకలతో రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపింది. కోటి ఉద్యోగాలు జెనరేట్ అవుతాయని వెల్లడించింది. 2024లో 48 లక్షల పెళ్లిళ్లు, 5.9 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు వివరించింది.