News March 22, 2024
నా భర్తది ఓపెన్ మైండ్: రకుల్ ప్రీత్

తాను ధరించే కురచ దుస్తులపై తన భర్త జాకీ భగ్నానీ ఎలాంటి అభ్యంతరం తెలపరని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. తన భర్త కానీ, అత్తమామలు కానీ బట్టల విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోరని.. వారిది ఓపెన్ మైండ్ అని చెప్పారు. పెళ్లయితే మహిళలే తమ దుస్తుల స్టైల్ మార్చాలా అని ఆమె ప్రశ్నించారు. కాగా ఇటీవల నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News April 7, 2025
హిట్మ్యాన్ Vs ఛేజ్మాస్టర్.. గెలుపెవరిది?

IPL: వాంఖడేలో ఇవాళ MI, RCB మధ్య హై ఆక్టేన్ మ్యాచ్ జరగనుంది. గాయంతో గత మ్యాచ్కు దూరమైన రోహిత్ ఇవాళ అందుబాటులో ఉంటారని తెలిసింది. దీంతో హిట్మ్యాన్ రోహిత్, ఛేజ్ మాస్టర్ కోహ్లీ మధ్య పోరు వీక్షించేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. బుమ్రా కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడి బౌలింగ్లో 5సార్లు ఔటైన విరాట్ 95 బంతుల్లో 140రన్స్ చేశారు. హెడ్ టు హెడ్ MI-19, RCB-14. ఇవాళ పైచేయి ఎవరిదో? COMMENT చేయండి.
News April 7, 2025
BLACK MONDAY: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్

భారత స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 3939 పాయింట్లు నష్టపోయి 71,425, నిఫ్టీ 1,160 పాయింట్లు కోల్పోయి 21,743 వద్ద ప్రారంభమయ్యాయి. బ్యాంకు, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. దీంతో నిపుణులు ఇవాళ బ్లాక్ మండేగా పేర్కొంటున్నారు.
News April 7, 2025
తమిళనాడులో ఈడీ సోదాలు

తమిళనాడులో ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం చెన్నైలోని డీఎంకే మంత్రి KN నెహ్రూ, ఆయన కుమారుడు అరుణ్ నెహ్రూకు సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్(TVH)లో అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.