News July 5, 2024

నాకు ప్రాణహాని ఉంది.. భద్రత ఇవ్వండి: హైకోర్టులో అంబటి పిటిషన్

image

AP: ఇప్పటివరకు తనకున్న 4+4 గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. DGP, పల్నాడు SPకి వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. దీనికి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

Similar News

News December 8, 2025

కృష్ణా: 880 ఉద్యోగాల భర్తీకై ఈ నెల 12న జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో మచిలీపట్నం SSR డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న జాబ్ మేళా జరగనుంది. 13 కంపెనీలు హాజరయ్యే ఈ జాబ్ మేళాకు SSC, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, పీజీ, బీటెక్ చదివిన 18- 40 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు హాజరు కావొచ్చని నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎంపికైనవారికి నెలకు 12- 25 వేల వేతనం ఉంటుందన్నారు.

News December 8, 2025

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

image

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్‌లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.

News December 8, 2025

‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్‌ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.